కరోనాకు తమిళ సిద్ధ మెడిసన్

 కరో నా వ్యాధిగ్రస్తులు కోలుకునేందుకు నిర్వహిస్తున్న చికిత్సల్లో ప్రాచీన సిద్ధవైద్య ప్రక్రియ రూపమైన కబసుర కుడినీర్‌ కషా యాన్ని తమిళనాడు వైద్యులు ఉపయోగిస్తున్నారు. అలాగే రీసెంట్ గా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొందరు కరోనా వైరస్‌ పీడితులకు ఇచ్చిన కబసుర కషాయం వారు త్వరగా కోలుకోడానికి ఉపకరించిందని ప్రయోగాత్మకంగా తేలింది. ఇతర అంశాల సంగతెలావున్నా రోగిలో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి కబసుర కషాయం ఉపకరిస్తోందని ఆధునిక వైద్యనిపుణులు కూడా చెప్పడంతో జిల్లాలోని వైద్యశాలల్లో, పలు క్వారంటైన్‌ కేంద్రాలలో కబ సుర కషాయం వినియోగం పెరుగుతోంది.  ప్రాచీన భారతీ యవైద్యశాస్త్రాల్లో సిద్ధవైద్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ప్రకృతిసిద్ధంగా లభించే వివిధరకాల చెట్ల, మొక్కల ఆకులు, బెరడు, వేర్లు తదితరాలను ఎక్కువగా విని యోగించే సిద్ధవైద్యం పట్ల ప్రపంచదేశాలలో కూడా ఇటీవలి కాలంలో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రోగనిరోధక ప్రక్రి యలలో సిద్దవైద్య విధానాలను అమలు చేయడానికి కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ రాజముద్ర వేసింది. స్ధానిక స్విమ్స్‌ అసుపత్రి ప్రాంగణంలోని సిద్ధ చికిత్స, పరిశోధనావిభాగం పలురకాల సిద్ధ వైద్యవిధానాలను అమలు చేస్తూవుంది.
అల్లం, పిప్పళ్లు, తేలుకొండిచెట్టు, నల్లకరక్కాయ, కోకిలాక్షి, సుగంధవాకం, తిప్పతీగ, భ్రమరామరి, నేలవే ము, బ్రహ్మముష్టి మొదలైన 15 రకాల ప్రకృతి సహజవనరు లతో కబసుర కుడినీర్‌ పేరుతో పొడి మందును తయారు చేసా రు. ఆ పొడిని నిర్ణీణ పద్ధతిలో వేడినీళ్లలో మరిగించి తయా రు చేసే కషాయం కరోనా వైరస్‌ పీడితులు త్వరగా కోలుకు నేలా చేస్తోందని ఆ వైద్యవిభాగం ఇన్‌ఛార్జి సామ్‌రాజ్‌ తెలిపారు. స్వతగా ఎంబీబీస్‌ డాక్టర్‌ కూడా అయిన జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఈ కషాయం గురించి తెలుసుకుని ఇద్దరు కరోనా పాజిటివ్‌ రోగులకు ఆధునిక మందులతో పాటు వినియోగించారని, వారు ఐదురోజుల్లో కోలుకుని ఇళ్ల కు వెళ్లారని డాక్టర్‌ సామ్‌రాజ్‌ తెలిపారు. ఈ విషయం తెలిసి చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తమ స్వగ్రా మమైన తుమ్మలగుంట గ్రామంలోని 2400 ఇళ్లకు కబసుర కుడినీర్‌ ప్యాకెట్లను పంపిణీ చేయించారు.  రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపకరిస్తుందని ఆధునిక వైద్యనిపుణులు కూడా గుర్తించడంతో పలు క్వారంటైన్‌ కేంద్రాలలో వైద్యపర్యవేక్షణలో ఉన్నవారికి కూడా ఈ కబసుర కషాయాన్ని రోజూ ఇస్తున్నారని కూడా ఆయన తెలిపారు. శారీరక సమస్యలకు వాత, పిత్త, కఫ సంబంధ వ్యాధులు కారణమని సిద్ధ వైద్యవిధానం పేర్కొంటుందని, ఈ క్రమంలోనే కఫ సంబంధ వ్యాధి అయిన కరోనా నియంత్రణకు కపసుర కుడినీర్‌ పేరుతో మందును తయారు చేసినట్టు సంబంధిత నిపుణులు చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్యన ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా లక్షణాలు ఉన్న వారు సిద్ధ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే.. 100 శాతం రికవరీ అవుతారని తెలిపింది. తేలికపాటి లక్షణాలు ఉన్న సమయంలో సిద్ధ వైద్యం పని చేస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తంమీద రోగ నిరోధకశక్తి పెరడానికి ఉపకరిస్తోందని ఆధునిక వైద్య నిపుణులు కూడా అంగీకరించడంతో జిల్లాలో కరోనా వైద్యచికిత్సలో సిద్ధ వైద్య ప్రక్రియలో భాగంగా తయారు చేసిన కబసుర కుడినీర్‌ కషాయం అంతర్భాగమవుతోంది. ఇది టాబ్లెట్ల రూపంలోనూ దొరుకుతోంది. ప్రీవెంటెవ్ డ్రగ్ గానే కాకుండా కరోనా వచ్చాక కూడా రికవరకి బాగా ఉపకరిస్తోంది.  ఆ టాబ్లెట్ల లను ఈ క్రింద లింక్ నుంచి ఆర్డర్ పెట్టచ్చు. రేటు కూడా అందుబాటులోనే ఉంది. కుడినీర్‌ కషాయాన్ని అమెజాన్ లో కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి