పోపుల పెట్టె వైద్యం..ఎంతో సులభ సాధ్యం

చిన్న జలుబు చేసినా, కాస్త తలనొప్పి అయినా సరే డాక్టర్ దగ్గరకకు పరుగెత్తడం, వారిచ్చే మందులను వేసు కోవడం, మానేయగానే పరిస్థితి మళ్లీ మొదటికి రావడం పరిపాటిగా మారింది. అప్పటికీ మన పెద్ద వాళ్లు చెప్తూనే ఉంటారు. శరీరానికి మందులు అలవాటు చేయద్దని. అయితే వినబుద్ది కాదు. అర్జెంటుంగా అన్ని సెట్ అయ్యిపోవాలని ఆత్రుత పడుతూంటాం.    కానీ పూర్వపు రోజుల్లో ఏదైనా తగ్గని జబ్బయితే తప్ప హాస్పిటల్ వెళ్లే వారు కాదు.  అందుకు కారణం హాస్పిటళ్లు, డాక్టర్లు తగినంతగా అందుబాటులో లేకపోవటమే కావచ్చు. కానీ చిన్నచిన్న అనారోగ్యాలు, అసౌకర్యాలు డాక్టర్లు, టెస్టులు, మందుల అవసరం లేకుండా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు అనే విషయం వారికి తెలియటమే కారణం అంటున్నారు నిపుణులు.  మన బామ్మ చెప్పే  వంటింటి చిట్కాలు చాలాసార్లు పనికొస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా వంటిళ్లు..కేవలం వంటలు వండటానికి మాత్రమే కాదు..ఔషధాలకు నిలయంగా కూడా చెప్పుకోవచ్చు. ఆహార పదార్థాల్లో వాడే వాటిల్లో మన ఆర్యోం దాగి ఉంది. పోపుల పెట్టేలో ఉండే దినుసులు ఎంతగానే ఉపయోగపడుతాయి. అలాంటివి కొన్ని ఇక్కడ చూద్దాం.

అల్లం : అజీర్ణ వ్యాధులకు అద్భుతంగా పని చేస్తుంది. అంతేగాకుండా ఉదర సంబంధ వ్యాధులకు దీనిని మించిన ఔషధం లేదు. వికారం, వాంతులు, విరోచనాలను నివారిస్తుంది.జీలకర్ర : జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ఆకలిని పుట్టించడమే కాకుండా శ్వాసక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆవాలు : గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.లవంగాలు : ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. దీనిని నమలడం వల్ల దంత రక్షణ, నోటిని, శ్వాసను తాజాగా ఉంచుతుంది. యాంటిసెప్టిక్, యాంటీ బయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తుంటారు. మిరియాలు : ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.వెల్లుల్లి : కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.  బెల్లం, అల్లం రసం కలిపి తీసుకుంటే కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. శొంఠి కొమ్ము అరగదీసి నుదుటి మీద పట్టుగా వేసుకుంటే తలనొప్పి తృటిలో తగ్గిపోతుంది. నిమ్మరసం, అల్లం రసంతో కలిసి తీసుకుంటే అజీర్తి మాయం ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు తేనె మరో కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పెట్టుకొని రోజు పొద్దున్నే పరగడుపున ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటే రక్త పోటు, శరీర బరువు అదుపులో ఉండటమే కాదు నీరసం వంటి చిన్న చిన్న అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.